ఫలితాల అనంతరం బైడెన్‌ తొలి ట్వీట్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకున్నందుకు......

Updated : 08 Nov 2020 04:54 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తొలి ట్వీట్‌ చేశారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. తనకు ఓటేసినా లేకపోయినా అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాసేపటికే బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా, కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు వారి ట్విటర్‌ ప్రొఫైల్‌ మారడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని