Biporjoy Cyclone: అతి తీవ్ర తుపానుగా ‘బిపోర్ జాయ్’.. 3 రాష్ట్రాలకు హెచ్చరికలు
అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను ‘బిపోర్ జాయ్’ మరో 12 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి అతి తీవ్ర తుపానుగా మారనుందని శనివారం భారత వాతావరణశాఖ తెలిపింది.
ముంబయి: అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను ‘బిపోర్ జాయ్’ మరో 12 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి అతి తీవ్ర తుపానుగా మారనుందని శనివారం భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది 24 గంటల్లో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. వాతావరణశాఖ వివరాల ప్రకారం.. వచ్చే 3 రోజుల్లో ఉత్తర-ఉత్తర-పశ్చిమ దిశగా తుపాను కదులుతుంది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్బందర్కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోర్బందర్కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. గుజరాత్‌ను తాకకపోవచ్చు. అయితే రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయి. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయి. బలమైన ఈదురు గాలులూ వీస్తాయి. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. తుపాను కారణంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. పోర్బందర్, గిర్, సోమనాథ్, వల్సాద్‌లకు జాతీయ విపత్తు దళ బృందాలను అధికారులు పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్
-
మానవత్వమా.. నువ్వెక్కడ?
-
మా జగన్నే తిడతావా అంటూ యువకుణ్ని కుళ్లబొడిచిన దుండగులు
-
విజిల్స్ వేశారని కేసా? పిలిచి విచారిస్తారా?: లోకేశ్
-
నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది: నారా భువనేశ్వరి భావోద్వేగం
-
భద్రాద్రి అన్నదాన సత్రంలో ఒకేసారి వెయ్యిమంది భోజనానికి ఏర్పాట్లు