భారత్‌పై ఐరాస ప్రశంసలు

కరోనా వైరస్‌పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌...

Updated : 18 Apr 2020 14:12 IST

న్యూయార్క్‌: కరోనా వైరస్‌పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని అందిస్తూ భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 చికిత్సలో మంచి ఫలితాలిస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని ఇప్పటి వరకు భారత్‌ అనేక దేశాలకు పంపింది. వీటిలో అమెరికా, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, మారిషస్‌ సహా పలు ఐరోపా, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. రెండు లక్షల క్లోరోక్విన్‌ మాత్రల్ని అందుకున్న డొమినిక్‌ రిపబ్లిక్‌ సైతం ఈ సందర్భంగా భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రష్యా సైతం భారత సంఘీభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. తమకు క్లోరోక్విన్‌ మాత్రల్ని అందించాలన్న రష్యా అభ్యర్థనను భారత్‌ ఇటీవల అంగీకరించింది.

ఇవీ చదవండి..

చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ బాసట

భారత్‌లో 480 మరణాలు, 14వేల కేసులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని