Ajit Doval: అంతర్జాతీయంగా భారత్‌ దూసుకెళ్తోంది: అజిత్‌ డోబాల్‌

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ దూసుకుపోతోందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జాతి నిర్మాణంలో భద్రతా బలగాలు

Updated : 12 Nov 2021 17:02 IST

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ దూసుకుపోతోందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జాతి నిర్మాణంలో భద్రతా బలగాలు ఎంతో కీలకపాత్ర పోషించాయని.. విధి నిర్వహణలో వేలమంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. 15వేల కి.మీపైగా సరిహద్దు వివాదాలున్నాయని.. చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 73వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల దీక్షాంత్‌ సమారోహ్‌ కార్యక్రమానికి డోబాల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ప్రతిభ చాటిన ఐపీఎస్‌లకు డోబాల్‌ జ్ఞాపికలు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 52 ఏళ్ల క్రితం తాను కూడా ఐపీఎస్‌ శిక్షణ పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. 7 దశాబ్దాల్లో జాతీయ పోలీస్‌ అకాడమీ నుంచి 5,700 మందికి పైగా ఐపీఎస్‌లు తమ శిక్షణ పూర్తిచేసుకుని బయటకు వచ్చారన్నారు. యువ ఐపీఎస్‌లపై ఎన్నో గురుతర బాధ్యతలు ఉన్నాయని.. వాటన్నింటినీ నెరవేర్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణ మాత్రమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని