కొత్త పార్లమెంట్‌ ఆకృతిలో చెవి రింగులు, ఉంగరాలు

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ సోనియో.. కొత్త పార్లమెంట్‌ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను విక్రయిస్తోంది.

Published : 02 Jun 2023 03:51 IST

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ సోనియో.. కొత్త పార్లమెంట్‌ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను విక్రయిస్తోంది. వీటిలో విలువైన వజ్రాలను కూడా పొదిగింది. దీంతోపాటు ప్రధాని మోదీ ఫొటోతో కూడిన డైమండ్‌ లాకెట్‌ను తయారు చేసి అమ్ముతోంది. 3డీ ప్రింట్‌ను ఉపయోగించి మోదీ చిత్రాన్ని ముద్రించింది. రెండున్నర అంగుళాల పొడవు ఉన్న ఆ లాకెట్‌పై ‘ది లెజెండ్‌’ అనే పదాన్ని చెక్కింది. వీటితోపాటు వెండితో తయారు చేసిన నూతన పార్లమెంట్‌ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని