Indian Railway: రైళ్లకు ప్రమాద సంకేతం.. రాకపోకల్ని గుర్తించే యంత్రాల్లో లోపాలు

నిర్దిష్ట మార్గంలో రైలు పట్టాలు ఖాళీగా ఉన్నాయా, రైళ్లేమైనా ఆ సమయంలో వెళ్తున్నాయా అనేది చెప్పడానికి ఉపయోగపడే సెన్సర్‌ యంత్రాల్లో లోపాలున్నట్లు బయటపడింది.

Updated : 18 Aug 2023 09:22 IST

ఇప్పటికే ఏడు జోన్లకు చేరుకున్న 3 వేల యూనిట్లు

దిల్లీ: నిర్దిష్ట మార్గంలో రైలు పట్టాలు ఖాళీగా ఉన్నాయా, రైళ్లేమైనా ఆ సమయంలో వెళ్తున్నాయా అనేది చెప్పడానికి ఉపయోగపడే సెన్సర్‌ యంత్రాల్లో లోపాలున్నట్లు బయటపడింది. పనితీరు సరిగా లేని వీటిని ఉపసంహరించుకోకుండా వాడడం కొనసాగిస్తే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఇటీవల జరిగిన తరహా ఘోర ప్రమాదాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ‘మల్టీ సెక్షన్‌ డిజిటల్‌ యాక్సిల్‌ కౌంటర్‌’ (ఎంఎస్‌డీఏసీ) వ్యవస్థలు ఒక్కొక్కటి రూ.5 లక్షలు ఖరీదైనవి. ఇలాంటి 4,000 యూనిట్లను రూ.200 కోట్లతో ఓ ప్రైవేటు సంస్థ వద్దనుంచి రైల్వే కొనుగోలు చేసింది. వీటిని ‘రైల్వే నమూనాలు, ప్రమాణాల సంస్థ’ (ఆర్‌డీఎస్‌వో) ఆమోదించింది. తూర్పు, ఆగ్నేయ-మధ్య, ఆగ్నేయ, ఉత్తర, మధ్య, వాయవ్య, ఉత్తర-మధ్య రైల్వే.. ఈ ఏడు జోన్లకు లోపభూయిష్టమైన 3,000 యూనిట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వీటి పనితీరును వాటిలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

 వీటి ఉపయోగం ఏమిటంటే..

రెండు ప్రాంతాల మధ్య రైలు మార్గం ఖాళీగానే ఉందా, ఏదైనా రైలు అక్కడ ఉందా అనేది తెలుసుకుని వేరే రైళ్లకు సిగ్నల్‌ ఇవ్వడానికి ఎంఎస్‌డీఏసీ వ్యవస్థ ఉపయోగపడుతుంది.  ఎన్ని పెట్టెలు వెళ్లాయో లెక్కించే యూనిట్‌ కూడా దీనిలోనే ఉంటుంది. పట్టాలపై రద్దీ గురించి స్టేషన్‌మాస్టర్‌కు ఇవి స్పష్టతనిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని