రామాలయం నిర్మాణ వ్యవహారంతో ఏకీభవించలేం: ఉదయనిధి

అయోధ్యలో మసీదు కూల్చి రామాలయం నిర్మించిన వ్యవహారంతో ఏకీభవించలేమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, మంత్రి ఉదయనిధి తెలిపారు.

Published : 19 Jan 2024 06:58 IST

చెన్నై, న్యూస్‌టుడే: అయోధ్యలో మసీదు కూల్చి రామాలయం నిర్మించిన వ్యవహారంతో ఏకీభవించలేమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, మంత్రి ఉదయనిధి తెలిపారు. చెన్నైలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పినట్లు డీఎంకేవారు ఏ మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదన్నారు. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించడంపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అక్కడి మసీదు కూల్చివేసి ఆలయం నిర్మించిన వ్యవహారంతో ఏకీభవించలేమని తెలిపారు. గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని