జేఈఈ మెయిన్స్‌ ఆలిండియా టాపర్‌గా రైతు బిడ్డ

మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్‌ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.

Published : 28 Apr 2024 05:10 IST

వాశిం: మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్‌ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని వాశిం జిల్లా బెల్ఖేడ్‌ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్‌కృష్ణ గజారే(19) జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో దేశంలోని ప్రథమ ర్యాంకు సాధించారు. ఈ పరీక్షల కోసం రోజుకు 10 గంటలకు పైనే చదివినట్లు ఆయన తెలిపారు. నీల్‌కృష్ణ క్రీడల్లో సైతం రాణిస్తున్నాడని, విలువిద్యలో జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాడని ఆయన తండ్రి నిర్మల్‌ గజారే తెలిపారు. ఐఐటీ బొంబాయిలో చదువుకుని, సైంటిస్ట్‌ కావడం తన లక్ష్యమని నీల్‌కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం అతను వచ్చే నెల జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని