పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు

ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు.

Published : 28 Apr 2024 06:33 IST

మధ్యప్రదేశ్‌ యువకుడి జంతుప్రేమ

ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాణిపురకు చెందిన యశ్వంత్‌ రైక్వార్‌ స్కూటర్‌ టైర్‌ కింద ఐదేళ్ల క్రితం ఓ కుక్క పిల్ల పడింది. అదృష్టవశాత్తు దానికి ఏం కాలేదు. దీంతో ఆ శునకాన్ని యశ్వంత్‌  ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు. అనంతరం అతడికి శునకాలపై ఇష్టం ఏర్పడింది. అలా మరో మూడు శునకాలను ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నాడు. ఏప్రిల్‌ 21న యశ్వంత్‌ వివాహం జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రికలో ‘భౌ భౌ’ పార్టీ పేరుతో నాలుగు శునకాలు.. రాకీ, జోజో, కాలు, లాలూ పేర్లను అతడు ముద్రించాడు. హల్దీ వేడుక, సంగీత్‌, పెళ్లి ఊరేగింపు లాంటి ప్రతి కార్యక్రమంలో ఈ శునకాలను భాగం చేశాడు.

ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని