ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు

హర్మూజ్‌ జలసంధి దగ్గర ఇరాన్‌ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్‌ చెరలోనే ఉన్నారు.

Published : 28 Apr 2024 05:24 IST

దౌత్యాధికారులతో మాట్లాడించామన్న ఇరాన్‌

దుబాయ్‌: హర్మూజ్‌ జలసంధి దగ్గర ఇరాన్‌ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్‌ చెరలోనే ఉన్నారు. అయితే వీరికి దౌత్య సిబ్బందితో మాట్లాడే అవకాశం కల్పించామని టెహ్రాన్‌ పేర్కొంది. ఈ నెల 13న పోర్చుగీసు పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకను ఇరాన్‌ తన నియంత్రణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో ఓ మహిళ సహా 17 మంది భారతీయుల ఉన్నారు. కేరళకు చెందిన ఆ మహిళను విడిచి పెట్టారు. మిగతావారిని స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్‌ కూడా సానుకూలంగా స్పందిస్తోందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని