మహిళలకూ సీడీఎస్‌ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి

ఇండియన్‌ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ (ఏఎఫ్‌ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 28 Apr 2024 05:26 IST

కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: ఇండియన్‌ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ (ఏఎఫ్‌ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 8 వారాల్లోగా దీన్ని తేల్చాలని పేర్కొంది. సీడీఎస్‌ పరీక్ష కోసం 2023 డిసెంబరులో యూపీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. ఐఎంఏ, ఐఎన్‌ఏ, ఏఎఫ్‌ఏల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష రాయడానికి మహిళలను అవకాశం ఇవ్వడంలేదని పిటిషనర్‌ వాదించారు. సీడీఎస్‌ కింద నిర్వహించే అఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ) పరీక్షకు మాత్రమే అతివలను అనుమతిస్తున్నారని తెలిపారు. దాని కింద కొంతకాలమే ఉద్యోగంలో కొనసాగేందుకు వీలు కల్పించే ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ మాత్రమే దక్కుతుందన్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకు ఇస్తున్నారని, సీడీఎస్‌ విషయంలోనూ ఇలాంటి వెసులుబాటు కల్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని