అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే

అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు తెలిపారు.

Published : 28 Apr 2024 05:26 IST

స్పష్టంచేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు

అయోధ్య: అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు తెలిపారు. వీరు రంజాన్‌ సెలవులను ముగించుకుని బిహార్‌లోని అరరియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ మదర్సాకు బయలుదేరినట్లు వెల్లడించారు. ఆ సమయంలో బస్సులో 95 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. వీరంతా ఎనిమిది నుంచి 15 ఏళ్లలోపు వారేనన్నారు. చిన్నారుల అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో వారిని అడ్డుకుని లఖ్‌నవూలోని ఓ శిబిరానికి తరలించామన్నారు. ప్రస్తుతం వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని