Shinde: ఫడణవీస్‌కు ఠాక్రే ద్రోహం చేశారు - ఏక్‌నాథ్ శిందే

ఇంటర్నెట్ డెస్క్: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2019లో మిత్రపక్షంగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌కు ద్రోహం చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Devendra Fadnavis)తో ఠాక్రే భేటీ కావడం, అంతకు ముందురోజు తమ కూటమిలో చేరాలని ఠాక్రేను ఫడణవీస్ సరదాగా ఆహ్వానించిన నేపథ్యంలోనే శిందే ఇలా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శాసన మండలిలో గత వారం విపక్ష పార్టీ ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు శిందే బదులిస్తూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి శివసేన, భాజపాల కూటమి మెజార్టీ సాధించిన తర్వాత 40-50 సార్లు ఫడణవీస్ ఫోన్ చేశారని (ఠాక్రేను పరోక్షంగా ప్రస్తావిస్తూ) అన్నారు. అయినప్పటికీ అటు వైపు (ఠాక్రే) నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు.
‘‘అంత వేగంగా రంగులు మార్చే వ్యక్తిని మహారాష్ట్ర ఎన్నడూ చూడలేదు. తనను తక్కువగా భావించే వాళ్లతోనే ఆయన వెళ్లారు’’ అని కాంగ్రెస్‌తో ఠాక్రే చేతులు కలపడాన్ని ఉద్దేశిస్తూ ఏక్‌నాథ్ శిందే విమర్శించారు. 2017 మున్సిపల్ ఎన్నికల్లో శివసేనకు 84, భాజపాకు 82 సీట్లు వస్తే.. ముంబయి మేయర్ పదవి శివసేనకు ఇవ్వాలని తాను సూచిస్తేనే అందుకు ఫడణవీస్ అంగీకరించారని గుర్తుచేశారు. కానీ, ఆయన (ఠాక్రే) మాత్రం కూటమి నుంచి బయటకు వెళ్లి ఫడణవీస్‌కు ద్రోహం చేశారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్‌లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 - 
                        
                            

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!
 - 
                        
                            

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
 - 
                        
                            

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
 - 
                        
                            

ట్రంప్ టారిఫ్‌లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 


