No Copyright: వివాహాది శుభకార్యాల్లో ‘పాటలకు’ కాపీరైట్‌ వర్తించదు: కేంద్రం

వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటలు ప్రదర్శించడం కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Published : 27 Jul 2023 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటలు ప్లే చేయడం కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అటువంటి వాటికి ఏ ఒక్కరు కూడా రాయల్టీ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాల్లో పాటల కాపీరైట్స్‌కు సంబంధించి డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (DPIIT) ఇటీవల స్పష్టత ఇచ్చింది.

‘వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల వినియోగం, ప్రదర్శనకు ఆయా భాగస్వామ్య పక్షాలు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది కాపీరైట్‌ యాక్ట్‌ 1957లోని సెక్షన్‌ 52(1)కు విరుద్ధం. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, సాహిత్య లేదా మ్యూజిక్‌/ఏదైనా సౌండ్‌ రికార్డింగ్‌లు కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్‌ 52 (1) (za) చెబుతోంది. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్‌ సంస్థలు వీటికి దూరంగా ఉండాలి’ అని పేర్కొంటూ డీపీఐఐటీ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.

కేరళ సీఎం ప్రసంగంలో ‘మైకు గోల’పై కేసు నమోదు

వీటికి సంబంధించి ఎవరైనా వ్యక్తులు/యాజమాన్యాలు/కాపీరైట్‌ సంస్థలు చేసే డిమాండ్లను అంగీకరించవద్దని సాధారణ పౌరులకూ డీపీఐఐటీ సూచించింది. ప్రభుత్వం చేసిన ప్రకటనను సామాన్యులతో పాటు ఆతిథ్య రంగం కూడా స్వాగతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని