Election Results: విజయోత్సవాలపై ఈసీ సీరియస్‌

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆధిక్యంలో ఉన్న పార్టీ కార్యకర్తలు కొవిడ్‌ ఉద్ధృతిని మరచి సంబరాలు చేసుకుంటున్నారు

Updated : 21 Dec 2022 15:51 IST

దిల్లీ: నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆధిక్యంలో ఉన్న పార్టీ కార్యకర్తలు కొవిడ్‌ ఉద్ధృతిని మరచి సంబరాలు చేసుకుంటున్నారు. నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపడుతుండంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. విజయోత్సవ ర్యాలీలు జరిపేవారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌హెచ్ఓను సస్పెండ్‌ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. అంతేగాక, విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంట ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది. లెక్కింపు కేంద్రానికి వెళ్లే అభ్యర్థులకు కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి చేసింది. రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అయినప్పటికీ నేడు పలు చోట్ల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని