Eknath Shinde: ఆ ఫలితాలు నా విరోధులకు చెంపపెట్టులాంటివి: ఏక్‌నాథ్ శిందే

ఠానే: గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తన విరోధులకు చెంపపెట్టు లాంటివని శివసేన చీఫ్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) అన్నారు. వారంతా ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలను సైతం విమర్శించారని మండిపడ్డారు. శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన పలువురు నేతలు తన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శివసేన బలంగా ఎదుగుతోందన్నారు. ప్రజలు తమ పక్షమని భావించిన వారికి ఈ ఫలితాలు చెంపపెట్టులా మారాయని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌ను విమర్శించిన వారిని ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారంటూ శివసేన (యూబీటీ) నేతలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత రెండున్నరేళ్లుగా తాను సీఎంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో గణనీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకు మించి గెలుచుకోకపోతే ఊరుకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటాని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న శిందే.. తాము 230కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం 80శాతం సామాజిక సేవ, 20శాతం రాజకీయాలు అనే మార్గదర్శక సూత్రానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్‌లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 - 
                        
                            

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!
 - 
                        
                            

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
 - 
                        
                            

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
 - 
                        
                            

ట్రంప్ టారిఫ్‌లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 


