Parliament Security Breach: లోక్‌సభలో అలజడి వెనక కారణమదే: రాహుల్ గాంధీ విమర్శలు

Parliament Security Breach: బుధవారం లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ.. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. 

Updated : 16 Dec 2023 15:24 IST

దిల్లీ: లోక్‌సభలో దుండగుల చొరబాటు ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం వల్లే ఈ ఘటన జరిగిందని మీడియాతో వ్యాఖ్యానించారు. (Parliament Security Breach)

‘పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం నిజంగానే జరిగింది. కానీ అది ఎందుకు జరిగిందనేది ముఖ్యం. అందుకు కారణం నిరుద్యోగం. మోదీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య నిరుద్యోగం’ అని రాహుల్‌ కేంద్రప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు సతమతమవుతున్నారని వెల్లడించారు. 

Parliament Security Breach: తొలుత తమకు తాము నిప్పంటించుకోవాలనుకున్నారట..!

బుధవారం లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ.. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో సభలో రాహుల్ కూడా ఉన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నారని.. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకున్నారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో కీలక నిందితుడైన లలిత్‌ ఝాకు కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అతణ్ని విచారించేందుకు వీలుగా 15 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. 7 రోజులకే అనుమతి లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాగర్‌, మనోరంజన్‌, నీలం, శిందేలకు కూడా కోర్టు గురువారం 7 రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని