Rajnath Singh: చైనాతో చర్చలు.. భారత్‌ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

పొరుగుదేశాలతో భారత్‌ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

Published : 29 Apr 2024 00:12 IST

అహ్మదాబాద్‌: ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చైనాతో జరుపుతున్న చర్చలు సజావుగా, సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. భారత్‌ ఎప్పుడూ తలవంచదన్నారు.

చైనాతో ఉన్న విభేదాలను ఎత్తిచూపుతూ మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలపై రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా స్పందించారు. ‘‘భారత్‌ ప్రస్తుతం బలహీనమైన దేశం కాదు. సైనిక పరంగా ఎంతో శక్తిమంతంగా మారింది. మన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలనుకుంటోంది. ఈ చర్చల ఫలితాలు ఎలా ఉండబోతాయే తెలుసుకునేందుకు కాస్త వేచి చూడాలి. అలా అని భారత్‌ ఎవరి ఎదుట తలవంచదు. ఇలా ఎప్పటికీ జరగదని భరోసా ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

దేశీయంగా తయారైన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2014లో రూ.600 కోట్లు ఉండగా.. దాని విలువ 2023-24లో రూ.21 వేల కోట్ల మార్క్‌ను దాటిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే నిర్ణయానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని