Modi: తొలిసారి భారత ప్రధాని అధ్యక్షతన నేడు ఐరాసలో చర్చ.. 

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే ఉన్నత స్థాయి చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్‌ఎస్‌సీలో ఓ

Updated : 09 Aug 2021 10:46 IST

దిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే ఉన్నత స్థాయి చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్‌ఎస్‌సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ అధ్యక్షతన ఈ చర్చ ప్రారంభం కానున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటంతో మోదీకి ఈ అవకాశం వచ్చింది. భద్రత మండలి సభ్య దేశాల నేతలు, ఐరాస అనుబంధ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ చర్చలో పాల్గొనే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్థంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని పేర్కొంది.

ఐరాసలో నాన్‌ పర్మనెంట్‌ మెంబర్‌ అయిన భారత్‌కు రొటేషనల్‌ పద్ధతిలో ఆగస్టు నెలకు భద్రత మండలి అధ్యక్ష స్థానం లభించింది. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష స్థానంలో ఉండటం భారత్‌కు ఇది పదోసారి. అంతకుముందు 1950 జూన్‌, 1967 సెప్టెంబరు, 1972 డిసెంబరు, 1977 అక్టోబరు, 1985 ఫిబ్రవరి, 1991 అక్టోబరు, 1992 డిసెంబరు, 2011 ఆగస్టు, 2012 నవంబరులో భారత్‌ అధ్యక్ష స్థానంలో ఉంది. అయితే ఆ సమయాల్లో ఎలాంటి బహిరంగ చర్చలు జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని