అక్షయ్ చిత్రంలో సత్యదేవ్!
సత్యదేవ్ తెలుగులో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్న నటుడు. ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రంలో వేశ్య భర్తగా నటించి...
ఇంటర్నెట్ డెస్క్: సత్యదేవ్ తెలుగులో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్న నటుడు. తాజాగా ఆయన బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రామ్ సేతు’ చిత్రంలో నటించనున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో దక్షిణాది నుంచి సీనియర్ నటుడు నాజర్‌ను కూడా తీసుకున్నారట. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రాత్ భరుచ్ఛా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 18న అయోధ్య రామజన్మభూమిలో షూటింగ్ ప్రారంభమైంది.
కరోనా రెండో దశ కారణంగా ప్రస్తుతం చిత్రీకరణ ఆగిపోయింది. లాక్డౌన్ ఎత్తివేయగానే మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుంది. సత్యదేవ్ హిందీ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ‘ది ఘాజీ అటాక్’తో పాటు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో నటించాడు. సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో అతని నటనతో పాటు సినిమాకి కూడా మంచి ప్రశంసలే దక్కాయి. ప్రస్తుతం తెలుగులో తమన్నాతో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’లో నటిస్తున్నాడు. ‘తిమ్మరుసు’, ‘గాడ్సే’లాంటి చిత్రాలు చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-
ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ