భావోద్వేగభరిత పోస్టర్‌

విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే ప్రధాన పాత్రల్లో టి. మహిపాల్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పోస్టర్‌’.

Updated : 04 Sep 2021 07:43 IST

విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే ప్రధాన పాత్రల్లో టి. మహిపాల్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పోస్టర్‌’. టి.శేఖర్‌ రెడ్డి, ఏ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని యూఎఫ్‌ఓ సంస్థ త్వరలో విడుదల చేయనుంది. ‘‘ఇది చిన్న సినిమాలలో పెద్ద చిత్రమవుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు చిత్ర దర్శకుడు. ‘‘ఇది మన ఊరిలో మనకి తెలిసిన కథలాగే ఉంటుంది. అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో విజయ్‌ ధరన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని