Pushpa2: ‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్‌ వార్నర్‌ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ

‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కామెంట్‌ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్‌ రిప్లై ఇచ్చారు.

Published : 02 May 2024 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమా పాటలు, డైలాగులపై ముఖ్యంగా ‘పుష్ప’ రీల్స్‌ చేసి సినీప్రియుల మనసులు కూడా దోచుకున్నారు ఆసీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner). తాజాగా ‘పుష్ప2’ నుంచి విడుదలైన తొలిపాట హుక్‌ స్టెప్‌పై ఆయన చేసిన కామెంట్.. దానికి అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ‘పుష్ప పుష్ప’ పాట ఊపేస్తోంది. ఈ పాట హుక్‌ స్టెప్‌ను బన్నీ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీనికి వార్నర్‌.. ‘ఈ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది. దీన్ని నేర్చుకోవాలి’ అని కామెంట్ పెట్టారు. దీనికి అల్లు అర్జున్‌ స్పందిస్తూ.. ‘ఇది చాలా ఈజీ. ఈసారి మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను’ అని రిప్లై ఇచ్చారు. దీనికి ఫ్యాన్స్‌ కూడా సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ‘వార్నర్‌ మీరు ఈ స్టెప్‌ ఎప్పుడు వేస్తారు’, ‘మీకు ఇది చాలా సింపుల్‌’ అంటున్నారు. ఈ ఆసిస్‌ బ్యాటర్‌ సందర్భం వచ్చిన ప్రతిసారీ తెలుగు పాటకు రీల్స్‌ చేస్తుంటారు. గతంలో మైదానంలోనూ పుష్పలోని  శ్రీవల్లి పాటకు డ్యాన్స్‌ వేసి వీక్షకుల్లో జోష్‌ నింపారు. తగ్గేదేలే అంటూ వారిని ఉత్సాహపరిచారు.

మరోవైపు ‘పుష్ప2’ నుంచి విడుదలైన ‘పుష్ప పుష్ప’ పాట కోట్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. మూడు భాషల్లో ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రిలీజైన కొన్ని గంటల్లో తెలుగులో నం.1లో ట్రెండింగ్‌లో ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తోన్న ఈ సీక్వెన్స్‌లో ఫహాద్ ఫాజిల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని