F2: ‘ఎఫ్‌ 2’.. హిందీ రీమేక్‌?

‘ఎఫ్‌ 2’.. 2019లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాన్ని అందించింది.

Updated : 13 Oct 2023 12:37 IST

‘ఎఫ్‌ 2’.. 2019లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాన్ని అందించింది. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా విజయంతో దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ని రూపొందించారు. భిన్న వయసులున్న ఇద్దరు వ్యక్తులు వారి భార్యలతో ఎదుర్కొంటున్న సమస్యలను వినోదాత్మకంగా తెరకెక్కించి అభిమానుల మనసులను గెలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల మొహాల్లో చిరునవ్వులు చిందించిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని త్వరలో హిందీలో రీమేక్‌ చేయనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నటుల కోసం బాలీవుడ్‌ హీరోలతో చర్చలు కూడా జరుపుతున్నారు. పరిశ్రమలో అన్ని భాషల సినీప్రియులకు ఈ చిత్రం వినోదాన్ని పంచుతుందని, త్వరలో దీనికి సంబంధించిన విషయాలను అధికారికంగా దిల్‌రాజు ప్రకటించబోతున్నారు’ అని సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని