Vijay: ‘నో’ చెప్పిన విజయ్‌.. హిట్‌ కొట్టిన విశాల్‌.. అదే సినిమా అంటే?

పూర్తి కథ వినకుండానే విజయ్‌ తన సినిమాలో నటించేందుకు నో చెప్పారని దర్శకుడు లింగుస్వామి తెలిపారు. అదే సినిమా అంటే?

Updated : 21 Dec 2023 09:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ హీరో నటించాల్సిన కథలో మరో హీరో నటించడం చిత్ర పరిశ్రమలో సహజం. దర్శకుడు ముందుగా అనుకున్న కథానాయకుడి డేట్స్‌ సర్దుబాటుకాకపోవడం, ఆయన కథలో మార్పులు కోరితే దర్శకుడు దానికి అంగీకరించకపోవడం తదితర కారణాల వల్ల అలా జరుగుతుంటుంది. ఓ హిట్‌ సినిమా విషయంలో హీరోలు విజయ్‌ (Vijay), విశాల్‌ (Vishal)కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ చిత్రం మరేదో కాదు ‘సండకోళి’ (Sandakozhi) (తెలుగులో పందెం కోడి- Pandem Kodi). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ సినిమా దర్శకుడు లింగుస్వామి (Lingusamy) నాటి సంగతులు వివరించారు. కథ మొత్తం వినకుండానే నటించేందుకు విజయ్‌ నో చెప్పారన్నారు.

నానితో లవ్‌స్టోరీ ఆ భయంతో చెప్పలేకపోయిన సందీప్‌ వంగా!

లింగుస్వామి ఏమన్నారంటే.. ‘‘సండకోళి’ కోసం హీరో, హీరోయిన్లుగా విజయ్‌, జ్యోతికను అనుకున్నా. ఈ మేరకు ఓ రోజు విజయ్‌ని కలిశా. సగం కథ వినిపించా. అయితే, కథానాయకుడి పాత్ర ఆయనకు అంతగా నచ్చినట్లు లేదు. అయినా నేను స్క్రిప్టు మొత్తం వినిపించాలనుకున్నా. విజయ్‌ సున్నితంగా తిరస్కరించి.. వేరే స్టోరీలు ఉంటే చెప్పమన్నారు. దాంతో, నేను అక్కడి నుంచి వెనుదిరిగా’’ అని తెలిపారు.

విశాల్‌ ఎంట్రీ..

తదుపరి ప్రయత్నంలో భాగంగా తన సినిమాలో హీరోగా విశాల్‌ను ఎంపిక చేశారు లింగుస్వామి. హీరోయిన్‌ మీరా జాస్మిన్‌. యాక్షన్‌ నేపథ్యంలో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లు వసూళ్లు రాబట్టింది. 2005 డిసెంబరు 16న విడుదలైన ఈ సినిమా.. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కోలీవుడ్‌లో రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్‌లోనూ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా సీక్వెల్  ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని