ఎంతో భిన్నమైన ‘ఫర్హానా’

‘ఫర్హానా’ చాలా విభిన్నమైన సినిమా అంటోంది నటి ఐశ్వర్య రాజేష్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్‌ వెంకటేశన్‌ తెరకెక్కించారు.

Published : 09 May 2023 01:38 IST

‘ఫర్హానా’ చాలా విభిన్నమైన సినిమా అంటోంది నటి ఐశ్వర్య రాజేష్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్‌ వెంకటేశన్‌ తెరకెక్కించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. నాపై నమ్మకంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇందులో నేను చాలా బరువైన పాత్ర పోషించా. మంచి కంటెంట్‌ను ప్రోత్సహించడంలో తెలుగు పరిశ్రమ ముందుంటుంది. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘ఇందులో మంచి కథ ఉంది. ఐశ్వర్య రాజేష్‌ అద్భుతంగా నటించింది. ఇది పక్కా తెలుగు సినిమాలాగే ఉంటుంది. దీన్ని విజయవంతం చేసి మరిన్ని సినిమాలు చేసే నమ్మకాన్ని ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నా’ అన్నారు దర్శకుడు. ‘‘ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం. ఫైనల్‌ కాపీ చూసుకున్నాక చాలా గర్వపడ్డాం’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో జస్టిన్‌ ప్రభాకర్‌, ఐశ్వర్య దత్తా, జితన్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని