thug of life: ‘థగ్‌లైఫ్‌’ గీత రచయితగా..

అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్‌ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్‌ లైఫ్‌’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు.

Updated : 29 Apr 2024 09:33 IST

గ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్‌ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్‌ లైఫ్‌’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. త్రిష కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను రాసినట్లు తెలిపింది చిత్రబృందం. మరో విశేషం ఏంటంటే.. ఈ పాటను రాసి, రికార్డ్‌ చేయడానికి కేవలం రెండు గంటల సమయమే తీసుకున్నారాయన. ఇప్పటికే ఎన్నో గీతాలను కమల్‌ స్వయంగా రాసి, పాడిన సంగతి తెలిసిందే. శింబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని