వావ్‌.. అనిపిస్తున్న ‘చిరు’ పెసరట్టు..!

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి దోశెలు వేయడంలో నేర్పరి అనే విషయం మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఈసారి మాత్రం BeTheRealMan ఛాలెంజ్‌ వల్ల ఆయన దోశెలు ఎలా వేస్తారో చూసే ఛాన్స్‌ దక్కింది. తారక్‌ విసిరిన BeTheRealMan ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరంజీవి తాజాగా తన తల్లి కోసం వంట చేసిన ...

Updated : 23 Apr 2020 15:52 IST

కేటీఆర్‌కు ఛాలెంజ్‌ చేసిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి దోశెలు వేయడంలో నేర్పరి అనే విషయం మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఈసారి మాత్రం Be The RealMan ఛాలెంజ్‌ వల్ల ఆయన దోశెలు ఎలా వేస్తారో చూసే ఛాన్స్‌ అభిమానులకు దక్కింది. తారక్‌ విసిరిన Be The RealMan ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరంజీవి తాజాగా తన తల్లి కోసం వంట చేసిన ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్నిరోజులగా ఇంటికే పరిమితమైన పురుషులు తమ కోసం, తమ పిల్లల కోసం ప్రతిరోజూ ఎన్నో సేవలు చేస్తున్న అమ్మ, భార్య, సోదరికి పనుల్లో కొంత సాయం చేయాలని పేర్కొంటూ ఇటీవల Be The RealMan అనే ఛాలెంజ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్‌.. తన ఇంట్లో పనులతోపాటు చీపురుపట్టి ఇంటి పరిసరాలను సైతం శుభ్రం చేశారు. అనంతరం ఆయన చిరంజీవిని ఛాలెంజ్‌ కోసం నామినేట్‌ చేశారు.

తారక్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరంజీవి తాజాగా తన ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇంటిని శుభ్రం చేయడంతోపాటు తన తల్లి అంజనాదేవికి పెసరట్టు ఉప్మా వేసి ఆమెకు అప్యాయంగా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘తారక్‌ నువ్వు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించాను. నేను రోజూ చేసే పనులే.. ఈ రోజు మీకోసం ఈ వీడియో సాక్ష్యం. నా తదుపరిగా కేటీఆర్‌, నా స్నేహితుడు రజనీకాంత్‌, మణిరత్నం సర్‌ను BeTheRealMan ఛాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నా’ అని చిరు పేర్కొన్నారు.

ఇవీ చదవండి

కత్తి పట్టిన చేత్తోనే.. చీపురు పట్టిన ఎన్టీఆర్‌
మాట మీద నిలబడి.. టాస్క్‌ పూర్తి చేసిన జక్కన్న


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని