ప్రియాప్రకాశ్‌ వారియర్‌కు ఏమైంది..?

కొంటెగా కన్నుగీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్‌నైట్‌లో స్టారైన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ప్రస్తుతం ఆమె తీసుకున్న ఓ నిర్ణయం.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ప్రియా ఎందుకు అలా చేశారా?....

Published : 18 May 2020 16:37 IST

షాక్‌లో అభిమానులు..!

తిరువనంతపురం: కొంటెగా కన్నుగీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ప్రస్తుతం ఆమె తీసుకున్న ఓ నిర్ణయం.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ప్రియా ఎందుకు అలా చేశారా? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రియా ప్రకాశ్ ప్రత్యేక వీడియోలను రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అభిమానుల కోరిక మేరకు ఇటీవలే ఆమె టిక్‌టాక్‌లోకీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వైదొలగారు. ఉన్నట్టుండి ఆమె తీసుకున్న నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇన్‌స్టా నుంచి ఆమె వైదొలగడానికి కారణమేమై ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. అయితే ఆమె పోస్ట్‌ చేసిన పలు వీడియోలకు, ఫొటోలకు పలువురి నుంచి అభ్యంతరకరమైన స్పందనలు రావడంతోనే ఇన్‌స్టా నుంచి బ్రేక్‌ తీసుకుని ఉండొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆమె ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌ వేదికగా అభిమానులతో చేరువగా ఉన్నారు.

మలయాళంలో తెరకెక్కిన ‘ఒరు అడార్‌ లవ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ప్రియా.. తెలుగులో సైతం నటించేందుకు సిద్ధమయ్యారు. తన నటన, హావభావాలతో ఆమె మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది. ‘ఒరు అడార్‌ లవ్‌’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ఆమె లైఫ్‌ను మార్చేసింది. ఆ ఒక్క వీడియోతో దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆమె అభిమానులను పొందారు.  దీంతో సోషల్‌మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగింది. అతి తక్కువ సమయంలో ఏడు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సెలబ్రిటీల్లో ప్రియా ఒకరు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని