Kajal: సత్యభామతో ప్రత్యేకం ఈ పుట్టినరోజు

తెలుగు సినిమా నాకు పుట్టినిల్లుతో సమానం అన్నారు కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’.

Updated : 19 Jun 2023 14:00 IST

తెలుగు సినిమా నాకు పుట్టినిల్లుతో సమానం అన్నారు కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ (Kajal). ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్‌’ దర్శకుడు శశికిరణ్‌ తిక్క స్క్రీన్‌ప్లే సమకూర్చడంతోపాటు, సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కాజల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సత్యభామ’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాలో శక్తివంతమైన ఓ పోలీస్‌ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు కాజల్‌. ఆమె మాట్లాడుతూ ‘‘ఈ పుట్టినరోజుని ‘సత్యభామ’ మరింత ప్రత్యేకంగా మార్చింది. తెలుగులో మళ్లీ నటిస్తుండడం, ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ప్రోత్సాహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘పెళ్లయినా కథానాయికలు కెరీర్‌ని విజయవంతంగా కొనసాగించొచ్చు అనడానికి కాజల్‌ ఓ నిదర్శనం. ‘సత్యభామ’లో కాజల్‌ పాత్ర, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. ‘‘సినిమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని చెబుతుంటారు శేఖర్‌ కమ్ముల. ఆయన దగ్గర పనిచేసిన నేను ఆ మాటనే అనుసరిస్తూ సినిమాలుచేస్తున్నా. ఈ చిత్రం ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని