Devil: డెవిల్‌ సన్నద్ధం

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘డెవిల్‌’ విడుదలకి ముస్తాబవుతోంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు సినీవర్గాలు తెలిపాయి. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ సరసన సంయుక్త మేనన్‌, మాళవిక నాయర్‌ నటించిన విషయం తెలిసిందే.

Updated : 22 Dec 2023 09:19 IST

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘డెవిల్‌’ విడుదలకి ముస్తాబవుతోంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు సినీవర్గాలు తెలిపాయి. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ సరసన సంయుక్త మేనన్‌, మాళవిక నాయర్‌ నటించిన విషయం తెలిసిందే. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే పీరియాడిక్‌ చిత్రమిది. బ్రిటిష్‌ రహస్య గూఢచారిగా కల్యాణ్‌రామ్‌ ఆకట్టుకునేలా నటించారు. ఆయన చేసే స్టైలిష్‌ పోరాట ఘట్టాలు, కథలోని డ్రామా, థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. 2 గంటల 26 నిమిషాల నిడివి వున్న ఈ సినిమాలో విజువల్స్‌ మరో మరోస్థాయిలో ఉంటాయ’’ని సినీవర్గాలు తెలిపాయి. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: గాంధీ నడికుడికర్‌, కూర్పు: తమ్మిరాజు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు