Kiran Abbavaram: హీరో అవుతానంటే ఎవరూ నమ్మలేదు.. చిన్నప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొన్నా: కిరణ్‌ అబ్బవరం

నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌పై మాట్లాడారు.

Published : 16 Sep 2023 16:01 IST

హైదరాబాద్‌: ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). రత్నం కృష్ణ తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కిరణ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌పై మాట్లాడారు.

‘‘చిన్నతనం నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. స్కూల్‌లో ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడితే బాధగా అనిపించేది. రాను రాను వాటిని ధైర్యంగా ఎదుర్కొవడం నేర్చుకున్నా. జాబ్ వదిలి సినిమాల్లోకి రావాలి అనుకున్న సమయంలో.. ‘‘ఏంటి నువ్వు హీరో అవుతావా?’’ అని విమర్శించారు. సినీ పరిశ్రమలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనిపించింది. ‘రాజావారు రాణి గారు’తో ఎంట్రీ ఇచ్చా. ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’తో అందరికీ పరిచయమయ్యా. ఆ సినిమా తర్వాత నాకు వరుస అవకాశాలు వచ్చాయి. గ్యాప్‌ లేకుండా వర్క్‌ చేశా. నాలుగేళ్లలో ఏడు సినిమాలు చేశా. అందులో కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి’’

SJ Suryah: హిట్‌ చిత్రానికి సీక్వెల్‌.. ఎస్‌.జె.సూర్య ఏమన్నారంటే..!

‘‘ఆన్‌లైన్‌ వేదికగా తరచూ ట్రోల్స్‌ ఎదురవుతూనే ఉంటాయి. మొదట్లో వాటి వల్ల ఎంతో ఇబ్బందిపడ్డా. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా. విమర్శలు చేసే వారందరికీ నా వర్క్‌తో సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. గతంలో వరుస సినిమాలు చేయడం వల్ల స్క్రిప్ట్‌లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లాయి. ఇకపై ఆ తప్పులు లేకుండా ప్రేక్షకులను అలరించే సినిమాల్లో నటించాలనుకుంటున్నా’’ అని కిరణ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని