Manchu Lakshmi: మనోజ్ రెండో పెళ్లి.. ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి: మంచు లక్ష్మి
నటుడిగా కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే మనోజ్.. ప్రణతీరెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే, పరస్పర అంగీకారంతో ప్రణతీతో వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు 2019లో ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్: నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ వస్తోన్న వార్తలపై నటి లక్ష్మి (Manchu Lakshmi) స్పష్టతనిచ్చారు. శనివారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సోదరుడి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆయన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి. ఇప్పుడున్న రోజుల్లో నిస్వార్థమైన, నిజాయతీ కలిగిన ప్రేమను పొందడం చాలా కష్టం. మనోజ్ అలాంటి ప్రేమను పొందుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నా. అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి’’ అని ఆమె వివరించారు.
అనంతరం, ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణు చేసిన కామెంట్స్‌పై ఆమె స్పందించారు. ‘మా’ అధ్యక్షుడయ్యాక తనపై ఎక్కువగా ప్రతికూల ప్రచారం జరిగిందని ఇటీవల విష్ణు అన్నారు. ఈ అంశంపై స్పందన కోరగా.. ‘‘అవన్నీ పనికి రాని విషయాలు. ఒక రాజకీయ వ్యవస్థలో ఒకరు బాగున్నారంటే.. అతనిపై బురద జల్లడానికి మరొకరు సిద్ధంగా ఉంటారు. ఒక రంగంలోకి దిగాక మంచితోపాటు చెడును కూడా ఆహ్వానించాలి. సినీ పరిశ్రమలో హీరోలందరూ బాగానే ఉంటారు. కానీ, ఈ ఫ్యాన్స్ మాత్రం ఎందుకింతలా కొట్టుకుంటారో నాకు అర్థం కాదు. కొంతమంది మనుషులు ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచిస్తారు. నువ్వు ఎంత మంచి చేసినా వాళ్లు చెడుగానే చూస్తుంటారు. నెగెటివిటీని ఆహ్వానించడానికి విష్ణుకు కాస్త సయమం పడుతుంది. అయినా, పర్వాలేదు. ప్రతీది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతి అనుభవం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి’’ అని ఆమె బదులిచ్చారు.
ఇక లక్ష్మి ప్రస్తుతం ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. దీనితోపాటు ఆమె ‘ఆహా’ వేదికగా ప్రసారమవుతోన్న ‘చెఫ్ మంత్ర సీజన్ -2’కు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం