NTR: ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ బయల్దేరిన ఎన్టీఆర్‌.. ఎందుకంటే?

ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) దుబాయ్‌ వెళ్తున్నారు. అక్కడ జరిగే ఓ సినీ వేడుకలో పాల్గొననున్నారు.

Published : 14 Sep 2023 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో ఎన్టీఆర్‌ (NTR) తన కుటుంబంతో కలిసి నేడు దుబాయ్‌ పయనమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎక్స్‌ (ట్విటర్‌)లో సందడి చేస్తున్నారు. సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా (SIIMA) వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (సైమా) వేడుక ఘనంగా జరగనుంది. ఈ ఏడాది వేడుకకు దుబాయ్‌ వేదిక కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ దుబాయ్‌ బయల్దేరారు.

ఇక ఎన్టీఆర్‌తో పాటు హీరోలు యశ్, రిషబ్‌ శెట్టి, హీరోయిన్లు మృణాల్‌ ఠాకూర్‌, శ్రీలీల కూడా సైమా అవార్ట్స్‌ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే ఈ సంవత్సరం సైమా అవార్డుల్లో  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. అలాగే ‘సీతారామం’ చిత్రానికి 10 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. ఇక ‘కాంతార’ (Kantara),‘కేజీయఫ్‌2’ (KGF Chapter 2) సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. ఇక తెలుగులో ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్, నిఖిల్‌, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేష్‌ పోటీపడుతున్నారు. 

సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో తనయుడితో?

ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ అండర్ వాటర్‌ ఫైటింగ్‌ సీన్‌ ఉందన్న సంగతి తెలిసిందే. దీని కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ముంబయి నుంచి తీసుకొచ్చిన ట్రైనర్స్‌ దగ్గర ఎన్టీఆర్‌ శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఈ సీన్‌ షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనికోసం చిత్రబృందం ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ సెట్‌ ఫొటోలు ట్విటర్‌లో షేర్‌ అవుతున్నాయి.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని