Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో తనయుడితో?

సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఓ స్టార్‌ హీరో తనయుడి సరసన ఆమె నటించనుందని టాక్‌.

Published : 13 Sep 2023 21:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన అభినయం, డ్యాన్స్‌తో సౌత్‌లో విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న సాయి పల్లవి (Sai Pallavi) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు  మార్మోగుతోంది. స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) తనయుడు జునైద్‌ ఖాన్‌ (Junaid Khan) త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్‌ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులోనే హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ప్రేమకథా నేపథ్యంలో రూపొందనున్న ఆ సినిమాకి ఆమిర్‌కు సన్నిహితుడైన సునీల్‌ పాండే దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా సాయి పల్లవి ఫ్యాన్స్‌ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే షారుక్‌, సల్మాన్‌లతో సినిమాలు చేయాలనుకోను: అనురాగ్‌ కశ్యప్‌

జునైద్‌కు నటన అంటే ఎంతో ఆసక్తి. ఈ మేరకు లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ డ్రామా స్కూల్‌లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. ముంబయిలో పలు నాటకాలు ప్రదర్శించాడు. తన తండ్రి నటించిన ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. తన తనయుడు గురించి ఆమిర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడిషన్స్‌ ఇచ్చే సమయంలో తాను ఫలానా హీరో తనయుణ్ని అని చెప్పేవాడుకాదని, తొలి సినిమా ఖరారుకాక ముందు దాదాపు 20 సార్లు తిరస్కరణకు గురయ్యాడని తెలిపారు. సాయి పల్లవి విషయానికొస్తే.. ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాలతో గతేడాది ప్రేక్షకులను అలరించిన ఆమె ఈ ఏడాది ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్‌ సరసన ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని