Prabhas Sreenu: ‘ప్రభాస్‌ మీపై కోప్పడ్డారా?’: ప్రభాస్‌ శ్రీను ఏమన్నారంటే?

ప్రభాస్‌తో తాను దూరంగా ఉంటున్నారనే గాసిప్స్‌పై ప్రభాస్‌ శ్రీను స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

Published : 17 Nov 2023 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో ప్రభాస్ (Prabhas) ఏ విషయంలోనూ సలహా ఇవ్వరని, నిన్ను నువ్వు తెలుసుకో అంటారని కమెడియన్‌ ప్రభాస్‌ శ్రీను (Prabhas Sreenu) అన్నారు. వీరిద్దరు ఎప్పటి నుంచో స్నేహితులనే సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో తనకున్న చనువు గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపిన శ్రీను తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మరికొన్ని విశేషాలు పంచుకున్నారు. ప్రభాస్‌తో ప్రస్తుతం తనకు దూరం పెరిగిందని వచ్చిన గాసిప్స్‌పైనా స్పందిస్తూ.. అలాంటిదేం లేదన్నారు.

ఎన్టీఆర్‌తో అల్లు శిరీష్‌ ఫొటో.. రకుల్‌ రియల్‌ పిక్‌.. ఇంకా ఎన్నో విశేషాలు.!

సలహా ఇస్తే భయంతో పనిచేస్తావని, అలా చేయడం సరైందికాదని ప్రభాస్‌ తనతో చెప్పినట్లు శ్రీను వెల్లడించారు. రియలైజేషన్‌కు ఎక్కువ సమయం ఇస్తారని చెప్పారు. ప్రభాస్‌కు నచ్చకపోవడంతో తాను కొన్ని అలవాట్లు మార్చుకున్నానన్నారు. ‘ఇతరుల మాట విని మీపై ప్రభాస్‌ కోప్పడిన సందర్భాలున్నాయా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ తనకెప్పుడూ అలా అనిపించలేదన్నారు. తమ స్నేహం నదీ ప్రవాహంలా సాగుతుందన్నారు. వరుస సినిమాల చిత్రీకరణలతో ఇరువురు బిజీగా ఉంటున్నట్లు తెలిపారు. శ్రీను తెరంగేట్రం చేసి దాదాపు 20ఏళ్లు పూర్తయ్యాయి. ‘వర్షం’, ‘చక్రం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘డార్లింగ్‌’, ‘పౌర్ణమి’ తదితర చిత్రాల్లో ప్రభాస్‌తో కలిసి నటించారు శ్రీను. ప్రభాస్‌ విషయానికొస్తే... ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటించిన ‘సలార్‌ పార్ట్‌ 1’ డిసెంబరు 22న విడుదల కానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని