
Allu Arjun:‘పుష్ప’ ట్రైలర్‌కి ముహూర్తం
ఒక పక్క ప్రత్యేక గీతం చిత్రీకరణ సాగుతోంది. మరోపక్క ప్రచారాన్ని హోరెత్తించే పనిలో పడింది చిత్రబృందం. ‘పుష్ప’ ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. ఆ విషయాన్ని సినీ వర్గాలు సోమవారం ప్రకటించాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఇప్పటికే పాటలతో ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెల 6న ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తున్నారు. ప్రత్యేక గీతం చిత్రీకరణ కూడా షురూ అయ్యింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత ప్రత్యేక గీతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫహాద్ పాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్.