samantha: ఆయనే నా అభిమాన నటుడు

తమ నటన, అందంతో ఎందరికో ఆరాధ్యులుగా మారిన నాయకానాయికలకూ అభిమాన నటీనటులుంటారు. సందర్భం వచ్చినప్పుడు ఆ అభిమానం చాటుకోవడానికి వెనకాడరు.

Updated : 28 Feb 2024 09:40 IST

మ నటన, అందంతో ఎందరికో ఆరాధ్యులుగా మారిన నాయకానాయికలకూ అభిమాన నటీనటులుంటారు. సందర్భం వచ్చినప్పుడు ఆ అభిమానం చాటుకోవడానికి వెనకాడరు. అగ్ర తార సమంత సైతం తనకిష్టమైన నటులెవరో మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఇంతకీ సామ్‌ బాగా ఇష్టపడేదెవరినో తెలుసా? మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టిని. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం కొచ్చి చేరిన సమంత.. షూటింగ్‌ అనంతరం మమ్ముట్టితో కలిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘నాకు అత్యంత ఇష్టమైన నటుడు’ అనే క్యాప్షన్‌తోపాటు స్టార్‌ ఎమోజీని జోడించింది. మరో పోస్టులో ఫహాద్‌ ఫాజిల్‌ బిల్‌బోర్డు ఫొటోని షేర్‌ చేస్తూ ‘నాకిష్టమైన మరో నటుడు’ అనే వ్యాఖ్య జోడించింది. సమంత వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటాడెల్‌’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.

గౌతమ్‌కి స్వాగతం

మరోవైపు ‘భ్రమయుగం’తో హిట్టు అందుకున్న మమ్ముట్టి ‘బజూకా’ సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. డీనో డెన్నిస్‌ తెరకెక్కిస్తున్న చిత్రమది. ఇందులో దర్శకుడు, సీనియర్‌ నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.. బెంజమిన్‌ జోషువా అనే కీలక పాత్రలో నటించనున్నారు. మమ్ముట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ.. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఎక్స్‌లో పంచుకున్నారు. ఆయన అపరాధ పరిశోధక అధికారి పాత్ర పోషించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని