Sudheer Babu: సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రారంభం
భవ్య క్రియేషన్స్ పతాకంపై సుధీర్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్ నిర్మాత.శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. సీనియర్ నటుడు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
భవ్య క్రియేషన్స్ పతాకంపై సుధీర్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్ నిర్మాత.శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. సీనియర్ నటుడు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కథానాయకుడిగా సుధీర్‌బాబు పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ దశలో ఆయనతో సినిమా చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోంది. కథ వినగానే సుధీర్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. ఆయన ఓ శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపిస్తారు. మార్చి 14 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామ’’న్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘నిర్మాత ఆనందప్రసాద్ అన్నా, ఆయన సంస్థ అన్నా ఎంతో గౌరవం. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. శ్రీకాంత్, భరత్‌లతో కలిసి నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘పోలీస్ డిపార్ట్మెంట్ నేపథ్యంలో ఓ విభిన్నమైన కథతో రూపొందుతున్న సినిమా ఇది. దర్శకుడు మహేష్ ఓ మంచి కథని తీసుకొచ్చారు’’ అన్నారు. ‘‘తెలుగులో ‘ప్రేమిస్తే సినిమాని అందరూ చూశారు. నటుడిగా పరిచయమైన 19 ఏళ్ల తర్వాత నేరుగా తెలుగులో చేస్తున్న ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం’’ అన్నారు నటుడు భరత్. కొత్త రకమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు దర్శకుడు. ఈ సినిమాకి ఛాయాగ్రాహణం: అరుల్ విన్సెంట్, కళ: వివేక్, కూర్పు: ప్రవీణ్ పూడి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్‌ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.