Tamannaah: ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్‌ మానేశా: తమన్నా

ఓ హాలీవుడ్‌ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్‌ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే?

Published : 30 Apr 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటున్న ప్రముఖ హీరోయిన్లలో తమన్నా (Tamannaah) ఒకరు. ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె ‘బాక్‌’ (Baak)తో థ్రిల్‌ పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ హారర్‌ కామెడీ మూవీ మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారామె. ఆ సినిమా సంగతులతోపాటు ఇతర విషయాలు పంచుకుంటున్నారు. హాలీవుడ్‌ ఫిల్మ్‌ని చూశాక వ్యాక్సింగ్‌ (చర్మంపై రోమాలు తొలగించడం) చేయించుకోవడం మానేశానని తెలిపారు. ‘‘హౌజ్‌ ఆఫ్‌ వ్యాక్స్‌’లో వ్యాక్స్‌తో పలు రకాలుగా చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాక నేను వ్యాక్సింగ్‌ మానేశా’’ అని అన్నారు.

‘అరణ్మనై’ సిరీస్‌లో రూపొందిన 4వ చిత్రం ‘బాక్‌’. కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌ సి (Sundar C). నటిస్తూ స్వయంగా తెరకెక్కించారు. మరో హీరోయిన్‌ రాశీఖన్నా (Raashii Khanna) కీలక పాత్ర పోషించారు. ఇంతకుముందు తమన్నా- రాశీఖన్నా కలిసి ‘బెంగాల్‌ టైగర్‌’ (రవితేజ హీరో)లో నటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ‘బాక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గుర్తుచేసుకుంటూ రాశీపై ప్రశంసలు కురిపించారు తమన్నా. రాశీ నిజాయతీగా పని చేస్తారని, ఆమెలాంటి వ్యక్తిని ఇండస్ట్రీలో తాను చూడలేదని పేర్కొన్నారు. తెలుగులో ‘ఓదెల 2’లో, హిందీలో ‘వేదా’ చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు తమన్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని