Good luck sakhi: రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించారు. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు.

Updated : 07 Dec 2022 16:23 IST

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించారు. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ‘‘బ్యాడ్‌ లక్‌ సఖి’’ గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘‘రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి.. సరదా సయ్యాటకి’’ అంటూ సరదాగా సాగుతున్న ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. హరిప్రియ, సమీర భరద్వాజ్‌, ఎంఎల్‌ఆర్‌ కార్తికేయన్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ షూటర్‌గా కనిపించనుంది. ఆమెకు శిక్షణ ఇచ్చే కోచ్‌గా జగపతిబాబు నటించారు. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: చిరంతాన్‌ దాస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని