Bhagavanth Kesari: నా ఊపిరే నీకు ఉయ్యాల..

మరికొన్ని రోజుల్లో ‘భగవంత్‌ కేసరి’గా ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతున్నారు అగ్రకథానాయకుడు బాలకృష్ణ. అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated : 05 Oct 2023 13:58 IST

మరికొన్ని రోజుల్లో ‘భగవంత్‌ కేసరి’గా ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతున్నారు అగ్రకథానాయకుడు బాలకృష్ణ. అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని ‘గణేష్‌’ అనే మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘ఉయ్యాలో ఉయ్యాలా..’ అంటూ సాగే మరో గీతాన్ని బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. ‘ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా.. అవుమల్లా అవుమల్లా గీ సేతుల్లో నిన్ను మొయ్యాలా’ అంటూ బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధాన్ని తెలుపుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాసలో సాగుతున్న ఈ గీతానికి అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా ఎస్పీ చరణ్‌ ఆలపించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని