Bhagavanth Kesari: భగవంత్‌ కేసరి.. ఉయ్యాలో ఉయ్యాల..

‘భగవంత్‌ కేసరి’గా థియేటర్లలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు.

Updated : 02 Oct 2023 13:09 IST

‘భగవంత్‌ కేసరి’గా థియేటర్లలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా ఈనెల 4న ‘‘ఉయ్యాలో ఉయ్యాల’’ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్‌ను పంచుకుంది చిత్ర బృందం. అందులో బాలకృష్ణ నది ఒడ్డున ఓ పాపతో కూర్చొని సరదాగా గడుపుతున్నట్లు కనిపించారు. తెలంగాణ నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. దీనికి తమన్‌ సంగీతమందిస్తున్నారు. సి.రామ్‌ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని