Nara Lokesh: యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది.

Updated : 18 Dec 2023 14:11 IST

విశాఖపట్నం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్‌ సైట్‌ నుంచి ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. లోకేశ్‌ వెంట తల్లి భువనేశ్వరి (Nara Bhuvaneshwari), అత్త వసుంధర (Vasundhara).. ఇతర కుటుంబసభ్యులు కలిసి నడిచారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది.

మధ్యాహ్నం అగ్రిగోల్డ్‌ బాధితులు, మీ సేవా నిర్వాహకులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించనున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్ద సాయంత్రం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇవాళ్టితో యువగళం పాదయాత్ర ముగియనుంది. విశాఖ శివాజీనగర్‌లో పాదయాత్ర ముగింపు సందర్భంగా పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరిస్తారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. 97 నియోజకవర్గాల్లో సాగింది. ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను తెదేపా (TDP) భారీ ఎత్తున నిర్వహించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని