Ambati Rambabu: మంత్రి అంబటి తీరుపై వైకాపాలో అసమ్మతి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైకాపాలో అసమ్మతి మరోసారి బయటపడింది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు గళం విప్పారు.

Updated : 28 Oct 2023 08:46 IST

గుండ్లపల్లి(నకరికల్లు), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైకాపాలో అసమ్మతి మరోసారి బయటపడింది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు గళం విప్పారు. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గురువారం రాత్రి కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి అంబటి నిర్వహిస్తున్న ‘గడప గడప’కు కార్యక్రమానికి పోటీ అన్నట్లుగా ‘జయహో జగనన్న’ పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహ మండపం వద్ద సభ నిర్వహించారు. దానికి వైకాపా నియోజకవర్గ నాయకుడు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. స్థానిక నాయకుడు కాసర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న తమను మంత్రి పట్టించుకోవటం లేదని, సొంత ఎజెండాతో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మండలంలోని అతి పెద్ద గ్రామపంచాయతీ గుండ్లపల్లిని మంత్రి విస్మరించారని, గ్రామాభివృద్ధికి రూ.40 లక్షలు వెచ్చించి ఎంపీపీగా అనురాధను గెలిపిస్తే అధిష్ఠానం గుర్తించలేదన్నారు. గుండ్లపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకోలేదన్నారు. అంబటి మాకొద్దు స్థానికులకే సత్తెనపల్లి సీటు కేటాయించాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని