గోవాలో భాజపా తొలి జాబితాలో పారికర్‌ తనయుడికి దక్కని చోటు..

గోవాలో గురువారం విడుదలైన భాజపా తొలి జాబితాలో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సహా 34 మంది పేర్లున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు పణజీ టికెట్‌ లభించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే

Published : 21 Jan 2022 04:48 IST

పణజీ: గోవాలో గురువారం విడుదలైన భాజపా తొలి జాబితాలో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సహా 34 మంది పేర్లున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు పణజీ టికెట్‌ లభించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండడం వల్లనే ఉత్పల్‌కు అక్కడ అవకాశం కల్పించలేదని, రెండు ప్రత్యామ్నాయ స్థానాలు ఆయనకు సూచించామని పార్టీ గోవా వ్యవహారాల బాధ్యుడు దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. తండ్రి ఎమ్మెల్యేగా చేసిన స్థానంలో పోటీ చేయడాన్ని ఉత్పల్‌ పారికర్‌ సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు పారికర్‌ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వేరే స్థానం నుంచి ఆయన పోటీ చేయరని చెప్పాయి. ఉత్పల్‌ను తమ పార్టీలో చేరాలని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ బహిరంగంగా ఆహ్వానిస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే మద్దతిస్తామని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని