Siddaramaiah : లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఒక్క ఓటూ వేయొద్దు : సిద్ధరామయ్య

కర్ణాటకలోని (Karnataka) పేద ప్రజల కోసం బియ్యం అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు. పేదలంటేనే గిట్టని భాజపాకు (BJP) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Published : 07 Sep 2023 01:34 IST

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వానికి పేదలంటేనే గిట్టదని కర్ణాటక(Karnataka) సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) విమర్శించారు. అందుకే వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు (BJP) ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భాజపా ‘నీచమైన’ పార్టీ అని తీవ్రంగా విమర్శించిన సిద్ధరామయ్య.. కేంద్ర ప్రభుత్వానికి మానవత్వమే లేదన్నారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం అన్న భాగ్య పథకం కింద ఒక్కో లబ్ధిదారుడి కోసం అదనంగా ఐదు కేజీల బియ్యం అడిగితే తిరస్కరించిందని ఆరోపించారు. ‘నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు కేజీల బియ్యం పంపిణీ చేశా. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని నాలుగు, ఐదు కేజీలకు తీసుకొచ్చింది. ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరో ఐదు కేజీలు ఇస్తానని నేను వాగ్దానం చేశాను’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

చింతమనేని, తోట సీతారామలక్ష్మి సహా 52 మందిపై కేసులు నమోదు

అన్న భాగ్య పథకం అమలు కోసం అదనపు బియ్యం కావాలని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఇండియాకు లేఖ రాశామని సిద్ధరామయ్య చెప్పారు. కేంద్రం ఆ బియ్యం రాకుండా అడ్డుకుందని ఆరోపించారు. దీన్నిబట్టి భాజపాకు పేదలంటే గిట్టదని అర్థమవుతోందన్నారు. బియ్యానికి డబ్బులు ఇస్తామని చెబితే తొలుత అంగీకరించిన ఎఫ్‌సీఐ.. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వెనక్కి తగ్గిందన్నారు. పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని సిద్ధరామయ్య ఆక్షేపించారు. అదే డబ్బు అంబానీ, అదానీలకు ఇస్తే దేశం, ప్రజలు అభివృద్ధి చెందుతారా? అని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు