Yuvagalam: చింతమనేని, తోట సీతారామలక్ష్మి సహా 52 మందిపై కేసులు నమోదు

బేతపూడి ఘటనకు సంబంధించి పోలీసులు 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 38 మంది యువగళం వాలంటీర్లు, 14 మంది నాయకులు సహా 52 మందిపై కేసులు నమోదు చేశారు. 

Published : 06 Sep 2023 20:38 IST

భీమవరం: బేతపూడి ఘటనకు సంబంధించి పోలీసులు 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 38 మంది యువగళం వాలంటీర్లు, 14 మంది నాయకులు సహా 52 మందిపై కేసులు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్‌, తోట సీతారామలక్ష్మి సహా 14 మంది నాయకులపైనా హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు వివిధ కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. భీమవరం కోర్టులో హాజరుపరిచి మళ్లీ స్టేషన్‌కు తీసుకొచ్చిన పలువురు యువగళం వాలంటీర్ల చేత బలవంతంగా సంతకాలు సేకరించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర భీమవరం పీఎస్‌కి చేరుకుని బలవంతపు సంతకాల సేకరణను అడ్డుకున్నారు.  ఈక్రమంలో పోలీసులు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని