Mamata Benarjee: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై దీదీ కీలక వ్యాఖ్యలు

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దిల్లీలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.

Published : 18 Dec 2023 18:53 IST

దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు. భాజపా (BJP) ను ఓడించమే లక్ష్యంగా సీట్ల పంపకంతో పాటు పలు సమస్యల్ని తమ కూటమిలోనే పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.  మూడోసారి కూడా నరేంద్ర మోదీ(PM Modi)యే ప్రధాని అవుతారంటూ భాజపా చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. అది అంత తేలిక కాదన్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో భాజపా ప్రభావం పెరుగుతోందంటూ విలేకర్లు ప్రస్తావించగా..  ‘భాజపా బలంగా లేదు.. అలాగే, మేం కూడా బలహీనంగా ఉన్నాం. దీన్ని అధిగమించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హిందీ బెల్ట్‌, ఇతర ప్రాంతాల మధ్య వివక్షతో చూడటం నాకు ఇష్టంలేదు’ అన్నారు.

ఒకే రోజు 78 మంది ఎంపీలపై సస్పెన్షన్‌

బెంగాల్‌లో ఆ మూడు పార్టీల మధ్య పొత్తు సాధ్యమే!

బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కచ్చితంగా సాధ్యమే అవుతుందని మమత వ్యాఖ్యానించారు. కృష్ణానగర్‌ సీటు అంశాన్ని తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయిస్తుందని.. మహువా మొయిత్రాకే తన పూర్తి మద్దతు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష ఎంపీలను పెద్ద ఎత్తున సస్పెండ్‌ చేయడంపైనా దీదీ స్పందించారు. భాజపా భయానికి ఈ చర్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. భాజపా భయపడుతోంది గనకే ఉభయసభల్లో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని