Mamata Banerjee: హస్తినకు మమత.. పార్లమెంటు ఘటనపై కామెంట్‌!

దిల్లీకి బయల్దేరిన సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు.

Updated : 17 Dec 2023 19:20 IST

కోల్‌కతా:  పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Benarjee) దిల్లీకి బయల్దేరారు. విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె దేశ రాజధాని నగరానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై దీదీ ఆందోళన వ్యక్తం చేశారు.  ఇది చాలా తీవ్రమైన అంశం, పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారన్న దీదీ.. ఈ ఘటనపై విచారణ జరగనివ్వండి అని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌ ఘటన తీవ్రమైన అంశం.. రాద్ధాంతం అనవసరం: ప్రధాని మోదీ

ఆరోగ్య కేంద్రాలకు కాషాయ రంగు వేయాలన్న కేంద్రం ఆదేశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలనే అంశాలను కూడా నిర్ణయించడానికి భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు, డిసెంబర్‌ 20న మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. బెంగాల్‌కు రావాల్సిన బకాయి నిధులను విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని