Raja Singh: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టయ్యారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు

Updated : 23 Aug 2022 11:08 IST

హైదరాబాద్: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టయ్యారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో రాజాసింగ్‌ను షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసుస్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని